డేటా సెంటర్ల ప్రమాదానికి చైనా సొల్యూషన్
China's solution to the data center crisisవైజాగ్ -హైదరాబాద్ లాంటి ప్రజలు అత్యధికంగా నివశించే చోట డేటాసెంటర్లు పెడుతుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, జనావాసాలకు తీవ్ర నీటి కటకట ఏర్పడుతుందని ఆందోళనలు నెలకొన్నాయి. లక్షల గ్యాలన్ల నీళ్లు డేటాసెంటర్లే తాగేస్తే ప్రజలు బతకడం ఎలా? అనే సందిగ్ధత ఏర్పడింది. అయితే నీటి కొరత లేకుండా నదీజలాలను సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలాగే డేటా సెంటర్ల రేడియేన్ నుంచి ప్రజల్ని కాపాడేందుకు భారీగా అడవుల్ని పెంచాల్సి ఉంటుంది.
ఇలాంటి సమయంలో చైనా ఇస్తున్న సొల్యూషన్ అత్యుత్తమంగా ఉంది. దీనిని వైజాగ్ లో ప్రారంభమైన మూడు భారీ డేటా సెంటర్ లకు అనువర్తింపజేయలేరా? టెక్నాలజీలో భారత్ ఎదిగేది ఎప్పుడు? అనే చర్చ మొదలైంది. అయితే చైనా డేటా సెంటర్ల రేడియేషన్ సమస్యకు ఎలాంటి పరిష్కారం వెతికింది? అంటే.. నేరుగా ఆ డేటా సెంటర్ ని తీసుకుని వెళ్లి.. మహా సముద్రంలో పెట్టడం ద్వారా అతిపెద్ద పరిష్కారాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది! సముద్రంలో నీటిని ఉపయోగించుకుని ఇది రేడియేషన్ ని తగ్గించే టెక్నాలజీ. అంతేకాదు దాదాపు 50 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్ ని కూడా ఈ ప్రాజెక్ట్ కారణంగా చైనా ఆదా చేయనుంది.
లక్షల గ్యాలెన్ల నీటి సమస్యకు, బిలియన్ల కిలోవాట్ల విద్యుత్ సమస్యకు ఒకటే పరిష్కారం కనుగొంది చైనా. తద్వారా ప్రజలకు ముప్పు తగ్గించింది. అదే సమయంలో భూమి కూడా వృధా కాదు. టెక్నాలజీ పరంగా ఖర్చు కొంత ఎక్కువే అయినా చైనా ఇంజినీరింగ్ ప్రజా వినాశకర పద్ధతులను అనుసరించకుండా ఒక ఇన్నోవేటివ్ పంథాను అనుసరించడం గమనించదగినది.







































