ఎస్ జె సూర్య సినిమా సెట్ లో ప్రమాదం

One dead in SJ.Suryah film set


కోలీవుడ్ దర్శకుడు కమ్ నటుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్న కిల్లర్ సినిమా సెట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కిల్లర్ సినిమా సెట్ లో గ్యాస్ సిలిండర్ పేలి కిల్లర్ చిత్ర బృందం లోని మదన్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందడం యూనిట్ సభ్యులోను, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపించింది.

చెన్నై ఒట్టేరి పరిసరాల్లోని ప్రముఖ బిన్నీ మిల్స్ ప్రాంగణంలో కిల్లర్ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడ సెట్స్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఏర్పడగా.. ఆ పేలుడు ధాటికి అక్కడే ఉన్న మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో చిత్ర యూనిట్ లోని మరో ముగ్గురుకి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి అని సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Accident at SJ.Suryah film set