త్రిష కు మెగా కోడలు గిఫ్ట్
Mega Family Summer Gift To Trisha
విశ్వంభర చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ.. ఆ చిత్రంలో నటించిన త్రిష కు మెగా కోడలు ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ పంపించడం హాట్ టాపిక్ అయ్యింది. చిరు తో కలిసి విశ్వంభర లో నటించిన త్రిష ఆ సినిమా రిలీజ్ విషయం పక్కనపెడితే మెగా ఫ్యామిలీ నుంచి మంచి గిఫ్ట్ అయితే అందుతుంది.
మెగా ఫ్యామిలీ నుంచి ఉపాసన ప్రత్యేకంగా నటి త్రిష కు అత్తమ్మాస్ కిచెన్ నుంచి పొడులు, పచ్చడి ఉన్న గిఫ్ట్ ప్యాక్ పంపించింది. ఉపాసన తమకు దగ్గరి వాళ్లకు, ఇలా తమ హీరోల హీరోయిన్స్ కి తన అత్తగారు సురేఖ చేత మొదలు పెట్టించిన అత్తమ్మాస్ కిచెన్ నుంచి పలు రకాల పొడులు, ఇంకా రెడీ మేడ్ ఉప్మా లాంటివి ఆ గిఫ్ట్ ప్యాక్ చేసి పంపిస్తుంది.
మెగా ఫ్యామిలీ నుంచి గిఫ్ట్ అందుకున్న త్రిష ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Trisha Gets Summer Gift From Mega Family Via Athammas Kitchen







































