FWICE కి రణ్వీర్ లీగల్ నోటీసులు
Ranveer Singh sends legal notice to film body
బాలీవుడ్ లో డాన్ 3 నిర్మాతలకు, రణవీర్ సింగ్ కి మధ్యన వివాదం ముదిరిపాకాన పడింది. ఈ మధ్యలో FWICE డాన్ 3 నిర్మాతలు ఇచ్చిన కంప్లైంట్ తో రణ్వీర్ సింగ్ పై బ్యాన్ విధించడం కలకలం సృష్టించింది. డాన్ 3 వివాదం సెటిల్ అయ్యేవరకు బాలీవుడ్ లో మూడేళ్ళ పాటు రణ్వీర్ సింగ్ తో ఎవరూ పని చెయ్యకూడదు అంటూ బ్యాన్ వించింది FWICE.
ఈ బ్యాన్ పై రణ్వీర్ సింగ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ ఇప్పుడు రణ్వీర్ లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. FWICE కి రణ్వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపించడం చర్చనీయాంశం అయ్యింది. తమకు నోటీసులు అందినట్లు ఎఫ్ డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ ధ్రువీకరించారు.
ఈ నోటీసులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. FWICE కి రణ్వీర్ కి మధ్యన మాత్రం వివాదం ముదిరినట్టు అయ్యింది. దానికి సంబందించిన మిగతా వివరాలు ఈ రోజు సాయంత్రానికి రివీల్ అయ్యే ఛాన్స్ వుంది.







































