ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fire Breaks Out At Restaurant In Delhi's Malviya Nagar

ఢిల్లీ లో ఘోర అగ్నిప్రమాదం - 21 మంది మృతి

Fire Breaks Out At Restaurant In Delhi's Malviya Nagar


ఈరోజు బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ లోని మాలవీయనగర్ లోని లెమన్ ట్రీ హోటల్ లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ప్రమాదంలో 21మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఐదు అంతస్తుల భవనంలో పై ఫ్లోర్ లో హోటల్, గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ లో చెలరేగిన మంటలు, హోటల్ లోని 25 గదులకు వ్యాపించినట్లుగా తెలుస్తుంది. ఈ హోటల్లో చాలామంది విదేశీయులు బస చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది మృతిచెందిన వారికి ప్రధాని మోడీ సంతాపం తెలియజేసారు.

మృతుల కుటుంబాలకు ప్రధాన మోడీ సహాయ నిధి నుంచి రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయాడిన వారికి 50 వేలు నష్టపరిహారం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. 
 

Death toll rises to 20 in Delhi restaurant fire