Advertisementt

నిరీక్షణ వెండితెర సాహసమా

Tue 14th Apr 2026 05:50 PM
ramayana  నిరీక్షణ వెండితెర సాహసమా
Ramayana నిరీక్షణ వెండితెర సాహసమా
Advertisement
Ads by CJ

ఆధునిక సినిమా ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులు, సాంకేతికత అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో `రామాయణం`,  లాంటి భారీ బడ్జెట్ పౌరాణిక లేదా ఫాంటసీ చిత్రాల కోసం దర్శకులు ఏళ్ల తరబడి సమయం కేటాయించడం  సాహసోపేతమైన నిర్ణయం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్  అందించాలన్నా? నాణ్యతలో రాజీ పడకూడదన్నా? సుదీర్ఘ కాలం శ్రమించడం తప్పనిసరని మేకర్స్ భావిస్తున్నారు. ఈ  ర క‌మైన నిరీక్షణ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. అలాగే  రాజమౌళి చిత్రాల తరహాలో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడానికి బలమైన పునాది వేస్తుంది.

అయితే  సుదీర్ఘ నిర్మాణ కాలంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సిందే. సాంకేతికత రోజురోజుకూ మారుతోన్న నేపథ్యంలో రెండేళ్ల క్రితం అద్భుతం అనుకున్న గ్రాఫిక్స్ సినిమా విడుదల సమయానికి పాతబడిపోయే ప్రమాదం ఉంది. అలాగే సినిమా ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం, వడ్డీల భారం పెరిగి బాక్సాఫీస్ లక్ష్యం మరింత క్లిష్టంగా మారుతుంది. ఒక స్టార్ హీరో సినిమా కోసం మూడేళ్లు వేచి చూడటం వల్ల సదరు హీరో మార్కెట్ విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సృజనాత్మక అలసట కలగకుండా మారుతోన్న ట్రెండ్స్‌కు అనుగుణంగా సినిమాను అప్‌డేట్‌గా ఉంచడం మేకర్స్‌కు పెద్ద పరీక్షగా మారుతుంది.

నిజానికి పౌరాణిక చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.  కానీ కేవలం విజువల్స్ నమ్ముకుంటే సరిపోదు.  సినిమా నాణ్యతతో పాటు కథలోని భావోద్వేగాలు బలంగా ఉన్నప్పుడే ఆ చిత్రం క్లాసిక్‌గా నిలిచిపోతుంది. భారీ చిత్రాల కోసం వెచ్చించే సమయం అనేది  రెండంచుల కత్తి లాంటిది. అది దర్శకుడి విజన్ స్పష్టంగా ఉంటే ఆస్కార్ స్థాయి అద్భు తాన్ని ఆవిష్కరించవచ్చు. లేదంటే అంచనాల త‌ప్పొచ్చు. మారుతోన్న టెక్నాలజీని అందుకుంటూ కాలంతో పోటీ పడి ప‌ని చేయాలి. లేదంటే ఇప్పుడున్న పోటీలో అంత సుల‌భం కాదు.  

Ramayana:

Bollywood Ramayana

Tags:   RAMAYANA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ