Advertisementt

దేవరలో మిస్ అయినా డ్రాగన్ లో మిస్ అవదు

Tue 14th Apr 2026 07:12 PM
alia bhatt  దేవరలో మిస్ అయినా డ్రాగన్ లో మిస్ అవదు
Alia Bhatt in NTR Dragon దేవరలో మిస్ అయినా డ్రాగన్ లో మిస్ అవదు
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత బాలీవుడ్ క్యూటీ అలియా భట్ ఇమ్మిడియట్ గా ఎన్టీఆర్-కొరటాల కలయికలో మొదలుకాబోయే దేవర చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు. కానీ అలియా భట్ ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవడం, ఆమె దేవర నుంచి తప్పుకోవడంతో దేవర లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పడు అలియా భట్ దేవర నుంచి తప్పుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలైపోయారు.

కానీ ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది. అంటే అలియా భట్ కి తెలుగు లో ఓ పాన్ ఇండియా ఆఫర్ వచ్చింది అనే వార్త చూసి అది ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ లోనే అని మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్-నీల్ కలయికలో మొదలైన పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్. 

అయితే ఇప్పుడు డ్రాగన్ చిత్రంలోకి అలియా భట్ ఎంటర్ అవుతుంది, ఆమెను ఓ కీలక పాత్ర కోసం ప్రశాంత్ నీల్ సంప్రదించారనే వార్త చూసాక అబ్బ దేవర లో మిస్ అయినా ఇప్పుడు డ్రాగన్ ఎన్టీఆర్ కోసం దిగుతుంది ఈ క్యూటి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ వార్త నిజామా, లేదంటే గాలి వార్త అనేది తెలియాల్సి ఉంది. 

Alia Bhatt in NTR Dragon:

Alia Bhatt key role in NTR Dragon

Tags:   ALIA BHATT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ