Advertisementt

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి హిడెన్ ట్యాలెంట్

Tue 14th Apr 2026 05:16 PM
pawan kalyan  ప‌వ‌న్ క‌ళ్యాణ్  స‌తీమ‌ణి హిడెన్ ట్యాలెంట్
Pawan Kalyan wife hidden talent ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి హిడెన్ ట్యాలెంట్
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజ్నివా తన జీవితంలో సంగీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా   పంచుకున్నారు. ఏడేళ్ల వయసులోనే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ పెద్ద వేదికపై బీథోవెన్ స్వరాలను పలికించిన చిన్ననాటి ఫోటోను ఆమె షేర్ చేశారు. ఐదేళ్ల ప్రాయంలోనే వయోలిన్ పట్టిన తాను పదిహేనేళ్ల వయసులో మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు సంగీత సాధనను ఎలా కొనసాగించారో? గుర్తు చేసుకున్నారు.

అన్నా లెజ్నీవా పవన్ కళ్యాణ్ భార్య అవ్వ‌డంతో భ‌ర్త నుంచి ఆమె లోని క‌ళ‌కు పూర్తి ప్రోత్సాహం లభించింది.  సంగీతం పట్ల ఉన్న మక్కువను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్  పియానోను బహుమతిగా అందించారని వెల్లడించారు. ప్రస్తుతం వయోలిన్, పియానో తన వద్దే ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతకాలంగా వాటికి దూరంగా ఉన్నాన‌న్నారు. అయితే తనలోని సంగీతం సరైన సమయం కోసం వేచి చూస్తోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఆమెకు సంగీతంపై ఉన్న గాఢమైన అనురాగాన్ని, అంకితభావాన్ని చాటిచెబుతోంది.

సంగీతం అనేది భాషా భేదాలు, భౌగోళిక సరిహద్దులు లేని అద్భుతమైన వారధి అని అన్నా కొణిదెల అభివర్ణించారు. మనిషిలోని బాధను, ప్రేమని, ఆనందాన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వ్యక్తం చేయగలిగే శక్తి కేవలం సంగీతానికే ఉందన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే తన వ్యక్తిగత అభిరుచులను, శాస్త్రీయ సంగీతంతో తనకున్న విడదీయలేని బంధాన్ని పంచుకోవడం ద్వారా ఆమె అభిమానులకు మరింత చేరువయ్యారు. మ‌రి ఇదే ప్ర‌తిభ‌తో అన్నా లెజ్నివా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల‌ని ఆశ‌ప‌డేవారు లేక‌పోలేదు.

Pawan Kalyan wife hidden talent:

Pawan Kalyan s wife anna lezhneva hidden talent

Tags:   PAWAN KALYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ