ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Peddi Was Mounted On A Budget Of 350 Cr: Buchi

పెద్ది బడ్జెట్ ని రివీల్ చేసిన బుచ్చి

Peddi Was Mounted On A Budget Of 350 Cr: Buchi


చాలామంది సినిమా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, హీరోలు కానీ ఎక్కడా ఓపెన్ గా తమ సినిమా బడ్జెట్ ని రివీల్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అలా రివీల్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అటు ఇటు అయితే ప్రోబ్లేం తో పాటుగా ఐటి అధికారులు వస్తారు. అలాగే అభిమానుల కోసం కలెక్షన్స్ పోస్టర్ వెయ్యాలి. దానికి గనక ట్యాలీ కాకపోతే అదో గోల.

అలాంటి సమయంలో పెద్ది దర్శకుడు బుచ్చి బాబు పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విజయవాడ లో పెద్ది బడ్జెట్ ని రివీల్ చెయ్యడం అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. తన మొదటి సినిమా ఉప్పెన చిత్రాన్ని రూ.25 కోట్ల తో తీస్తే తన రెండో సినిమాని భారీ బడ్జెట్ తో తీసాను అని.. ఫ్లో లో పెద్దికి రూ.350 కోట్ల బడ్జెట్ అయ్యింది అంటూ అసలు బడ్జెట్ ని రివీల్ చెయ్యడంతో అక్కడే ఉన్న మైత్రి వారు ఆశ్చర్యపోయారు.

మరి అలా బడ్జెట్ రివీల్ చెయ్యడం కరెక్ట్ నా. పెద్ది పై చాలా నమ్మకం ఉంది, అందుకు తగిన అంచనాలు ఉన్నాయి. మొదటి రోజే రికార్డ్ కలెక్షన్స్ తేవడం ఖాయం. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఇలా ఓపెన్ ప్లాట్ ఫామ్ పై బడ్జెట్ రివీల్ చెయ్యడం అనేది నిజంగా సాహసమే. 

Peddi Budget Officially Revealed Buchi Babu