ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Malayalam beauty Femina George onboard for Raaka

ఎంతమందిని దించుతావ్ బన్నీ

Malayalam beauty Femina George onboard for Raaka


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ రాకా. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న రాకా చిత్రం ఇంటర్నేషనల్ స్టాండడ్స్ తో తెరకెక్కతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా.. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, ఇంకా కొంతమంది హీరోయిన్స్ రాకా లో భాగమవుతున్నారు.

తాజాగా రాకా టీమ్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ రాకా నటిస్తుంది అని తెలియడమే కాదు.. ఇప్పటికే ఆమె రాకా యూనిట్ లో చేరినట్లుగా సమాచారం. రాకా చాలా ఎమోషనల్ మూవీగా తెరకెక్కుతుంది అని, పాత్రలు కూడా ఎక్కువ ఉన్నాయని.. త్వరలోనే మరో యంగ్ హీరోయిన్ కూడా ఓ ఎమోషనల్ పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది.

ఇది చూసే ఏంటి బన్నీ ఇంకెంతమంది హీరోయిన్స్ ని దించుతావ్ రాకా కోసం అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రాకా షూటింగ్ ముంబై లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది. అల్లు అర్జున్ రీసెంట్ గానే భార్య స్నేహ తో కలిసి సమ్మర్ వెకేషన్స్ కి వెళ్ళొచ్చాడు.
 

Femina George joins Allu Arjun Raaka