బర్త్ డే ని కూడా డిజప్పాయింట్ చేసారు

Nikhil Swayambhu release date updateNikhil Swayambhu release date update


నిన్న సోమవారం జూన్ 1 న హీరో నిఖిల్ సిద్దార్థ్ బర్త్ డే. నిఖిల్ బర్త్ డే కి ఆయన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం స్వయంభు నుంచి గ్లింప్స్ వదిలి విషెస్ చెప్పిన మేకర్స్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. ఎప్పుడో ఏప్రిల్ రిలీజ్ అన్నవాళ్ళు మే వెళ్ళిపోయినా స్వయంభు రిలీజ్ డేట్ విషయంలో ఇంకా తేల్చడం లేదు.

స్వయంభు ఓటీటీ డీల్ ఇంకా అవ్వకపోవడం వల్లే మేకర్స్ స్వయంభు రిలీజ్ తేదీ ప్రకటించలేకపోతున్న విషయం తెలిసిందే. మే లో ఖచ్చితంగా స్వయంభు వస్తుంది అనుకుంటే జూన్ వచ్చిన ఇంకా విడుదల తేదికి నోచుకోకపోవడం మాత్రం నిఖిల్ అభిమానులను ఫుల్ గా డిజప్పాయింట్ చేసింది.

నిఖిల్ బర్త్ డే రోజున వీడియో తో పాటుగా స్వయంభు విడుదల తేదిని ఇస్తారని.. అనుకుంటే అది లేదు. మరి ఆగష్టు లో ఏమైనా స్వయంభు ని విడుదల చేస్తారేమో చూడాలి. ఏదో ఒక విషయం తేలితే పాన్ ఇండియా మార్కెట్ కి ఢోకా ఉండదు. లేదంటే కష్టం. 

Swayambhu Release date skips Nikhil's bday