అపజయమనేది ఎరుగకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిన అనిల్ రావిపూడి ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. తన తదుపరి సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ అవ్వగా.. సెకండ్ స్క్రిప్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారట రావిపూడి.
తనకు లక్కీ హీరోలుగా మారిన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి జూన్ లో సినిమా స్టార్ట్ చేసి 2027 సంక్రాంతికి సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. హిట్ మిషన్ గా వరసగా 9 విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి క్రేజ్ మాటల్లో చెబితే సరిపోదు.
ఆ క్రేజ్ ఎలా ఉంది అంటే వెంకీ-కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి తీయబోయే మూవీ ఇంకా మొదలు కాలేదు.. అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయిపోయిందనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ఏ ఓటీటీ సంస్థ ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందో తెలియదు కానీ.. ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయ్యిందట.
అయితే వరసగా మూడు వందల కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ హక్కులు జీ 5 సొంతం చేసుకుని భారీగా లాభపడింది. మరి ఇప్పుడు అనిల్ నెక్స్ట్ కి కూడా జీ 5 ఏమైనా భారీ డీల్ సెట్ చేసిందేమో అనే ఊహాగానాలు మాత్రం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.





భాగ్యశ్రీ బోర్సే - సింపుల్ అండ్ ఎలిగెంట్ 

Loading..