Advertisementt

విజయ్ పాలిటిక్స్ పై పవన్ కామెంట్స్

Tue 14th Apr 2026 10:19 AM
pawan  విజయ్ పాలిటిక్స్ పై పవన్ కామెంట్స్
Pawan Kalyan Has No Advice for Vijay విజయ్ పాలిటిక్స్ పై పవన్ కామెంట్స్
Advertisement
Ads by CJ

తమిళనాట TVK పార్టీ పెట్టి ఒంటరి పోరు చేస్తున్న విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాడో, లేదో అని అప్పుడే తమిళనాట ఎగ్జిట్ పోల్స్ మొదలైపోయాయి. విజయ్ కి NDA పొత్తు ఆఫర్ చేసినా బిజెపితో కలిసేందుకు విజయ్ విముఖత చూపారు. ఇక విజయ్ పొలిటికల్ కెరీర్ ని పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ తో పోల్చుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా బిజెపి తో కలవమని విజయ్ తో మధ్యవర్తిత్వం చేసారు అనే ప్రచారం జరగగా.. తను అసలు విజయ్ ని కలవలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా విజయ్ పొలిటికల్ కెరీర్ పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేసారు. విజయ్ చాలా సమర్ధుడని, చాలా పెద్ద స్టార్​ అని కొనియాడారు. 

అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని, కానీ తాను ఎవరికీ సలహా ఇవ్వనని, ఆఖరికి తన పిల్లల విషయంలో కూడా తాను అలానే ఉంటానని చెప్పిన పవన్ విజయ్​ చాలా పెద్ద స్టార్, ప్రతి పౌరుడికి రాజకీయాల్లోకి రావడానికి, పార్టీ స్థాపించడానికి హక్కు ఉందన్నారు. విజయ్ ఏ పాత్రలో ఉన్నా ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని తాను భావిస్తున్నానని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Pawan Kalyan Has No Advice for Vijay:

No advice needed - Pawan Kalyan on Vijay big step

Tags:   PAWAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ