సీఎం విజయ్ మాజీ భార్య బిజెపిలోకి
Vijay's ex-wife linked to possible BJP entry
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన హీరో విజయ్ కు తమిళనాడు ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ముందు ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసి విజయ్ పరువు తీసింది. కొన్నాళ్లుగా ఓ నటితో విజయ్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అంటూ ఆయన భార్య సంగీత విడాకులు పిటిషన్ లో పేర్కొంది.
ఆమె అన్నట్టుగానే విజయ్ నటి త్రిష తో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఎన్నికల ముందు జంటగా ఓ పెళ్ళికి వెళ్లిన విజయ్-త్రిష ఎన్నికల తర్వాత విజయ్ గెలవగానే అయన ఇంటికి వెళ్ళింది. ఆతర్వాత విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో త్రిష మెయిన్ హైలెట్ గా నిలిచింది. రీసెంట్ గా అజిత్ తల్లి మరణించిన వార్త విన్న సీఎం విజయ్, త్రిష తో కలిసి అజిత్ ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇంత ఓపెన్ గా జరుగుతున్నా సంగీత వెనుక ఎవరో ఉండి విజయ్ నుంచి విడిపోయేలా ప్రేరేపించారు, విజయ్ ని పొలిటికల్ గా వీక్ చేసేందుకు సంగీత తో కుట్ర చేయించారని అన్నారు. కానీ త్రిష-విజయ్ కలిసి తిరుగుతున్నారు. తాజాగా విజయ్ మాజీ భార్య సంగీత బీజేపీలో చేరబోతోంది అంటూ ఓ వార్త వైరల్ అయ్యి కూర్చుంది.
విజయ్ మాజీ భార్య సంగీత త్వరలోనే బిజెపి లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది, బిజెపి లో ఆమెకు ఉన్నత పదివి ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు రెడీగా ఉన్నారనే టాక్ నడుస్తుంది.







































