టాప్-10 రిచెస్ట్ భార‌తీయ‌ క్రికెట‌ర్స్

Top 10 Richest Indian CricketersTop 10 Richest Indian Cricketers

భారతదేశంలో క్రికెట్‌ని ఆట‌గానే కాదు.. ఒక బ‌ల‌మైన‌ సెంటిమెంట్ గా ప్ర‌జ‌లు చూస్తారు. మైదానంలో టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన చాలా మంది ఆటగాళ్లను ఎంత‌గానో ఆరాధించడం తెలిసిందే. అందుకే ఈ క్రీడాకారుల్లో ప‌లువురు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడాకారులుగా ఎదిగారు.

సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌, యువరాజ్, ద్ర‌విడ్ వంటి లెజెండ్స్ తమ అసాధారణ ఆటతీరుతో పిచ్‌పై రికార్డుల వేట సాగించడమే కాకుండా.. మైదానం వెలుపల వంద‌ల‌ కోట్ల రూపాయల ఆస్తులను కూడ‌గ‌ట్టారు. క్రికెటర్లందరూ తమ కష్టార్జితం.. బ్రాండ్ ప‌బ్లిసిటీ, తెలివైన పెట్టుబ‌డుల‌తో క్రీడా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా అవతరించారు.

భారతదేశపు టాప్ 10 రిచెస్ట్ క్రికెటర్ల జాబితాను పరిశీలిస్తే.. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రూ.1250 కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత స్థానాల్లో ఎం.ఎస్ ధోని రూ.1060 కోట్లు, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రూ.1050 కోట్లతో నిలిచి వెయ్యి కోట్ల క్లబ్‌లో తమ స్థానాలను పదిలపరుచుకున్నారు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ 350 కోట్లు, యువరాజ్ సింగ్ 291 కోట్లు, గౌతమ్ గంభీర్ 265 కోట్లు, సురేష్ రైనా 215 కోట్లు, రోహిత్ శర్మ 214 కోట్లు, రాహుల్ ద్రావిడ్ 197 కోట్లు, సునీల్ గవాస్కర్ 160 కోట్ల నెట్ వర్త్‌తో ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాప్ 10లో నిలిచారు.

Indian Cricketers