ఈ వారం కూడా డబ్బింగే గెలిచింది

Blast Zone box office performanceBlast Zone box office performance


గత రెండు వారాలుగా టాలీవుడ్ లో చిన్న సినిమాలు ఎన్ని విడుదలైనా వాటితో పాటుగా విడుదలైన డబ్బింగ్ సినిమాలకే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అవేమన్నా బావున్నాయా అంటే లేదు జస్ట్ యావరేజ్ టాక్ వచ్చిన డబ్బింగ్ చిత్రాలు అవి. అందులో సూర్య కరుప్పు ఒకటి. ఈ చిత్రానికి క్రిటిక్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తూ పూర్ రేటింగ్స్ ఇచ్చారు.

అయినప్పటికీ వీరభద్రుడు చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. యావరేజ్ సినిమాని ఆడియన్స్ హిట్ చేసారు. ఆతర్వాత వారం  దృశ్యం 3 ఏమిలేదు అన్నారు. ఈ చిత్రానికి సినీవిమర్శకులు చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్,  క్లైమాక్స్ తప్ప దృశ్యం 3 ఏమంత బాలేదు అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

ఇక గత గురువారం విడుదలైన మరో డబ్బింగ్ మూవీ అర్జున్ బ్లాస్ట్ జోన్ కి క్రిటిక్స్ పర్లేదు అన్నారు, ఆడియన్స్ నెత్తిన పెట్టుకోవడమే కాదు ఆ కరుప్పు, ఈ దృశ్యం 3 కన్నా బ్లాస్ట్ జోన్ బావుంది అన్నారు. ఎప్పుడో పడిపోయిన అర్జున్ మర్కెట్ మరోసారి బ్లాస్ట్ జోన్ తో కదిలింది.  ఈ చిత్రం కూడా హిట్ అవడంతో గత కొన్నివారాలుగా తెలుగు బాక్సాఫీసుపై డబ్బింగ్ మూవీస్ గెలుస్తున్నాయి. 

Blast Zone Movie