ఐకానిక్ థియేటర్ లో ప్రభాస్ స్పిరిట్ షూట్

Spirit progressing at HyderabadSpirit progressing at Hyderabad


కల్ట్ దర్శకుడు సందీప్ వంగ ప్రభాస్ కి అస్సలు రెస్ట్ ఇవ్వడం లేదు. వేసవి లేదు, తాపం లేదు షూటింగ్ అంటూ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రభాస్ తాయితీగా సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు. అని ప్రభాస్ ఒప్పుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ క్షణం తీరిక లేకుండా షూటింగ్ చేస్తేనే అనుకున్న సమయానికి సినిమాలు తెరపైకి వస్తాయి.

ప్రస్తుతం హైదరాబాద్ ఎండల్లో స్పిరిట్ షూట్ ని సందీప్ వంగ పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా స్పిరిట్ షూటింగ్ ని హైదరాబాద్ లోని ఐకానిక్ థియేటర్ అయిన విమల్ థియేటర్ కి షిఫ్ట్ చేశారట. హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ విమల్ థియేటర్‌ లో షూటింగ్ జరుగుతుందట.

ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ థియేటర్ నగరంలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రీసెంట్ గానే దీనిని రెన్నోవేట్ చేయించి కొత్తగా మార్చడమే కాదు.. చాలా సినిమాల ప్రీమియర్స్ ని ఇక్కడే ప్రదర్శిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ థియేటర్ ఇప్పుడు స్పిరిట్ షూటింగ్‌కు వేదికగా మారింది.

ఈ ప్రత్యేక షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ షూట్‌లో పాల్గొననున్నారని సమాచారం. ఆయన థియేటర్‌కు రానున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. 

Spirit progressing at Hyderabad