ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja and Vivek Athreya Film on Cards?

బాలయ్య తో కాదు రవితేజ తో నెక్స్ట్

Ravi Teja and Vivek Athreya Film on Cards?

 

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో #NBK111 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ని జూన్ 10 బాలయ్య బర్త్ డే కి రిలీజ్ చేసేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు. అయితే #NBK111 తర్వాత వివేక్ ఆత్రేయ, వంశి కనకమేడల ల డైరెక్షన్ లో చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా వివేక్ ఆత్రేయ, వంశీ కనకమేడల కాదు బాలయ్య లైనప్ లోకి కొరటాల శివ చేరారు. కొరటాల-బాలయ్య కాంబో అనౌన్సమెంట్ కూడా వచ్చింది. ఈ చిత్రం దసరాకి మొదలు కాబోతుంది. బాలయ్య తో చేసే అవకాశం లేకపోవడంతో వివేక్ ఆత్రేయ మాస్ రాజా రవితేజ దగ్గరకు వెళ్లారట.

ప్రస్తుతం శివ నిర్వాణ తో ఇరుముడి చిత్రం చేస్తున్న రవితేజ ఆ చిత్రం ముగింపు దశకు చేరుకోవడంతో మరో రెండు చిత్రాలను లైన్ లో పెడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అందులో వివేక్ ఆత్రేయ తో రవితేజ తదుపరి ప్రాజెక్ట్ ఉండబోతుంది అని తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ నచ్చి రవితేజ ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. 

Ravi Teja, Vivek Athreya join hands for a new project