ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> PC Sunday mood off Varanasi shoot: Swim, self-care and summer vibes

పూల్ లో వారణాసి బ్యూటీ జలకాలాటలు

PC Sunday mood off Varanasi shoot: Swim, self-care and summer vibes


బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా హైదరాబాద్ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పూల్ లో జలకాలాడుతుంది. సూపర్ స్టార్ మహేష్ తో వారణాసి పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం వారణాసి చిత్ర షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లోనే ఉంది. వారణాసి షూటింగ్ నుంచి బ్రేక్ రావడంతో ప్రియాంక చోప్రా స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ సేదతీరుతుంది.

పూల్‌సైడ్ బికినీ లుక్‌లో ప్రియాంక చోప్రా జలకాలాడుతూ ఎంజాయ్ చెయ్యడమే కాదు ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ.. అద్భుతంగా కనిపించింది. హైదరాబాద్ సమ్మర్ హీట్ ని ప్రియాంక ఇలా పూల్ లో సేదతీరుతూ తగ్గించుకుంటుంది. ఇంత ఎండలోనూ వారణాసి షూటింగ్ లో పాల్గొంటున్న ప్రియాంక చోప్రా ఈమధ్యన హైదరాబాద్ టు ముంబై అంటూ తెగ హడావిడి పడుతుంది.

వారణాసి చిత్రంలో మందాకినీ గా కనిపించబోతున్న ప్రియాంక చోప్రా పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా కనిపిస్తుంది. కుమార్తె, భర్త నిక్ జోనస్ తో సమాయం చిక్కినప్పుడల్లా టైమ్ స్పెండ్ చేస్తుంది. 
 

Priyanka Chopra takes a break from Varanasi