ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Suriya gifts new car to Karuppu cinematographer

హిట్ ఇవ్వండి - గిఫ్ట్ పట్టండి

Suriya gifts new car to Karuppu cinematographer


సినిమా ఇండస్ట్రీ లో హిట్ ఇవ్వండి - గిఫ్ట్ పట్టండి అనే కల్చర్ ఎప్పటి నుంచో నడుస్తుంది. నిర్మాతలు, హీరోలు తమ సినిమాలు హిట్ కొడితే ఆ సినిమా దర్శకులకు, టెక్నీకల్ సిబ్బందికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చూస్తున్నాము. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలామంది హీరోలు తమకు హిట్ ఇచ్చిన టెక్నీకల్ సిబ్బందికి భారీ గా గిఫ్ట్ లు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాజాగా ఆ లిస్ట్ లోకి హీరో సూర్య చేరారు. కొన్నాళ్లుగా హిట్ కోసం తపనపడిన సూర్య కి దర్శకుడు ఆర్ జె బాలాజీ కరుప్పు చిత్రంతో రూ.300 కోట్ల సినిమా ఇచ్చారు. కరుప్పు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సూర్య బ్యాక్ బౌన్స్ అయ్యేలా చేసింది. దానితో హ్యాపీ మోడ్ లోకి వచ్చిన సూర్య కరుప్పు టెక్నీషియన్స్ కి కాస్ట్లీ కారులు బహుమతిగా ఇచ్చారు.

కరుప్పు సినిమాకి  విజువల్స్ అందించిన డీఓపీ జీకే విష్ణుకి మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారును సూర్య బహుమతికి అందించారు. ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కారు ధర రూ.30 నుంచి రూ.40 లక్షల మధ్యలో ఉంటుంది అంటున్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా కారు గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది.

సో  సూర్య కరుప్పు టెక్నీకల్ టీమ్ లో ఇంకొంతమందికి కార్లు గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

Suriya's Grand Gifts After Karuppu Success