ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> When will the Peddi trailer be released?

పెద్ది రిలీజ్ ట్రైలర్ ఇంకెప్పుడు

When will the Peddi trailer be released?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు కేవలం మూడు రోజుల సమయమే ఉంది. జూన్ 4 న పాన్ ఇండియా వ్యాప్తంగా పెద్ది రిలీజ్ ఉండగా.. ఒకరోజు ముందే పెద్ది ప్రీమియర్స్ తో హడావిడి మొదలు పెట్టెయ్యబోతున్నారు మేకర్స్ ఇంకా మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం పెద్ది ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి.

విజయవాడ లో పెద్ది ఈవెంట్, ఇంకా హైదరాబాద్ ఈవెంట్స్ తో పెద్ది ప్రమోషన్స్ ముగియబోతున్నాయి. అయితే పెద్ది ట్రైలర్ కి అనుకున్నంత పోజిటివ్ టాక్ అయితే రాలేదు. పెద్ది ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యాన్స్ పెద్ది రిలీజ్ ట్రైలర్ కావాలని దానిపై హోప్స్ పెట్టుకున్నారు.

ఇదిగో పెద్ది రిలీజ్ ట్రైలర్, అదిగో పెద్ది రిలీజ్ ట్రైలర్, ప్రస్తుతం దానికి సంబందించిన వర్క్ జరుగుతుంది త్వరలోనే అంటూ సోషల్ మీడియాలో వినిపించడమే కానీ.. మేకర్స్ పెద్ది రిలీజ్ ట్రైలర్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈ ట్రైలర్ వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.

మరి రేపు విజయవాడ ఈవెంట్ లో ఏమైనా సర్ ప్రైజ్ చేస్తూ పెద్ది రిలీజ్ ట్రైలర్ వదులుతారా అనే ఆశలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. మరి మేకర్స్ ఆ విషయంలో ఎలాంటి ఆలోచనలో ఉన్నారో చూద్దాం. 

Peddi release trailer