ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Chaitanya lovely wishes to Sobhita

భార్య శోభితకు చైతు లవ్లీ విషెస్

Naga Chaitanya lovely wishes to Sobhita


అక్కినేని యువ హీరో నాగ చైతన్య ఎప్పుడు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. సమంత తో ప్రేమాయణం కూడా చాలా కామ్ గా సాగించిన చైతు విడాకుల తర్వాత కూడా చాలా సైలెంట్ గా కనిపించాడు తప్ప ఎలాంటి హడావిడి చెయ్యలేదు. మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తోనూ అంతే సీక్రెట్ లవ్ ని నడిపించిన చైతు పెళ్లి తర్వాత కాస్త మారాడు.

ఈరోజు శోభిత దూళిపాళ్ల బర్త్ డే. భార్య శోభిత బర్త్ డే సందర్భంగా చైతు షేర్ చేసిన ఫొటోస్ చూసి భలే సెల్ఫీలు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే మై లేడీ. నీతో కలిసి జీవితాన్ని షేర్ చేసుకునే అవకాశం దక్కినందుకు ధన్యవాదాలు అంటూ చైతు భార్య శోభితకు లవ్లీ విషెస్ తెలియజేసాడు.

శోభిత తో చైతు తీసుకున్న సెల్ఫీ ని అక్కినేని ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. శోభిత తో లైఫ్ లాంగ్ కలిసి సంతోషంగా ఉండాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Naga Chaitanya’s Heartfelt Birthday Wish for Sobhita Wins Hearts