జన నాయగన్ వస్తున్నట్టేనా

Line clear for Jana Nayagan

 

తమిళనాట సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ కష్టాలు వదిలిపోయాయా, జన నాయగన్ ఇప్పటికైనా విడుదలకు నోచు కంటుందా.. విజయ్ సీఎం అయ్యి రెండు వారాలు పైనే అవుతుంది. ఇప్పటికి జన నాయగన్ విడుదల తేదీపై మేకర్స్ కాన్ఫిడెంట్ గా రిలీజ్ డేట్ ఇవ్వలేకపోతున్నారు. జూన్ 19 న జన నాయగన్ రిలీజ్ అంటున్నారు.

కానీ ఇప్పటివరకు ఆ తేదీపై జన నాయగన్ నిర్మాతలు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అసలు CBFC జన నాయగన్ కు సర్టిఫికెట్ ఇవ్వలేదు. మరి జన నాయగన్ జూన్ 19 కి ఉంటుందా, ఉండదా అనేది విజయ్ ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ జన నాయగన్ రిలీజ్ విషయంలో చాలా డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు.

ఇప్పటికైనా జన నాయగన్ విషయం తేలితే వారు కూల్ అవుతారు. అటు జన నాయగన్ డిజిటల్ హక్కుల కోసం నిర్మాతల ఎదుట అదిరిపోయే ఆఫర్స్ పెడుతున్నాయి. ఈ వేడిలో సినిమా విడుదలైతే హిట్ ఖాయమని విజయ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Is Jana Nayagan Ready for Release