ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Audience Happy With Peddi Ticket prices

పెద్ది : ఆ విషయంలో ప్రేక్షకులు హ్యాపీనే

Audience Happy With Peddi Ticket prices


పెద్ది చిత్రానికి ఏపీలో ప్రీమియర్స్, అలాగే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుకు కూటమి ప్రభుత్వం అనుమతులిచ్చేసింది. కానీ తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు, ప్రీమియర్స్ కి అనుమతులు ఇంకా లభించలేదు. టికెట్ రేట్లు పెంచేస్తే నిర్మాతలకు ఓ రెండుమూడు రోజులు లాభాలొస్తాయి. ఆతర్వాత నాలుగు రోజులు థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించరు.

ఒక వేళ టికెట్ రేట్లు పెరగకపోతే మొదటి మూడు రోజులు నిర్మాతలకు కాస్త కలెక్షన్స్ తగ్గినా తర్వాత వారం రోజులు థియేటర్స్ కళకళలాడతాయి. తెలంగాణాలో ఇప్పటివరకు రేట్లు పెరగలేదు కాబట్టి ఆడియన్స్ హ్యాపీనే. నిర్మాతలకు కూడా కలెక్షన్స్ కి ఢోకా ఉండదు. పెంచితే ఓ మూడు రోజులు నిర్మాతల కళ్ళల్లో ఆనందం ఉన్నా, తర్వాత థియేటర్స్ కి ఆడియన్స్ రాకపోతే వారే ఇబ్బంది పడాలి.

ఒకవేళ టికెట్ రేట్లు పెరగకపోతే ఆడియన్స్ మాములుగా థియేటర్స్ కి ఫ్యామిలీస్ తో వెళతారు. అందులో వేసవి సెలవలు ఇంకా ముగియలేదు. సో తెలంగాణాలో పెద్ది రేట్లు పెరగకపోతే ఆ విషయంలో ప్రేక్షకులు హ్యాపీనే కదా..!
 

Peddi audiences is highly Exited