దేవ‌ర‌కొండ‌తో ఎవ‌రు ముందు? ఎవ‌రు వెనుక‌?

Vijay Devarakonda Lineup

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి క్రేజీ దర్శకులతో ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులను ఎక్కడా నిరుత్సాహపరచడం లేదు. ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో రెండు, మూడు చిత్రాలను అధికారికంగా ప్రకటిస్తూ  దూకుడును చూపిస్తున్నాడు. ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీజ‌నార్ద‌న` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే రాహుల్ సంకృత్యన్ ద‌ర్శ‌కత్వంలో భారీ పీరియాడిక్ చిత్రం `ర‌ణ‌బాలి` తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాల‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విజ‌య్ వ‌రుస ప‌ర‌జ‌యాల్లో ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు సినిమాలో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని కసి మీద ఉన్నాడు. రెండు సినామ‌ల‌పై అంతే నమ్మ‌కంగానూ క‌నిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కలయికలో రాబోయే సినిమాపై సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపించాయి.

ఈ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వల్ల ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేనట్లు స్పష్టమవుతోంది. విక్రమ్ కె. కుమార్ మార్క్ మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా పనులు చాపకింద నీరులా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు ఎలాంటి హ‌డావుడి లేకుండా సినిమాకు సంబంధించిన ప‌నుల‌న్నింటిని ముంబై నుంచి ఆప‌రేట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే `హాయ్ నాన్న` ఫేం దర్శకుడు శౌర్యువ్ సైతం విజయ్ దేవరకొండ కోసం ఒక బలమైన కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. మ‌రి ఈ రెండు చిత్రాల్లో ఏది ముందుగా మొద‌ల‌వు తుందంటే?  శౌర్యువ్ చిత్ర‌మే మొద‌లవుతుంద‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ లోగా ఈసినిమా పూర్తిచేసి అనంత‌రం విక్ర‌మ్ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

Vijay Devarakonda