అడవి శేష్ లేటెస్ట్ మూవీ డెకాయిట్ చిత్రంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ రాకముందు ఆ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా డెకాయిట్ సెట్ లోకి ఎంటర్ అవడమే కాదు ఆమెపై కొన్ని సన్నివేశాల షూట్ జరగడం, డెకాయిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యడము జరిగిన తరువాత ఈ ప్రాజెక్ట్ నుంచి శృతి హాసన్ తప్పుకుంది.
ఆతర్వాత డెకాయిట్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. గత శుక్రవారం విడుదలైన డెకాయిట్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. అంతేకాదు మృణాల్ ఠాకూర్ పాత్రకు అన్నివైపులా నుంచి మంచి అప్రిసెషన్స్ దక్కుతున్నాయి. మృణాల్ ఠాకూర్ పెరఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు.
అయితే డెకాయిట్ చిత్రం అందుకున్న రెస్పాన్స్ పై మృణాల్ ఠాకూర్ కి ఎలా ఉన్నా శృతి హాసన్ ఏమనుకుంటుందో. డెకాయిట్ చిత్రం నుంచి తప్పుకున్నందుకు బాధపడుతుందో, లేదంటే డెకాయిట్ చిత్ర రిజల్ట్ తో రిలాక్స్ అవుతుందో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఆ సినిమా మిస్ అయినందుకు బాధపడేది.
కానీ డెకాయిట్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం శృతి హాసన్ ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ ఆ కేరెక్టర్ ని మిస్ అయినందుకు ఆమె నిజంగా ఫీలవ్వాల్సిందే.




దోచుకున్నవాళ్లకు దోచుకున్నంత

Loading..