హ్యాట్రిక్ హీరో కి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. హీరో గా పరిచయమైనప్పటి నుంచి చేసిన మూడు సినిమాలు హిట్టే. కానీ నాలుగో సినిమా మాత్రం ఫట్ అనే సంకేతాలు బాక్సాఫీసు నుంచి కనిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ కి LIK బ్రేకులు వేసినట్టే కనిపిస్తుంది.
రెండు రోజుల క్రితమే ఎన్నో అడ్డంకులు దాటుకుని తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన LIK చిత్రానికి సౌండ్ లేదు. తెలుగులో అయితే చప్పుడు లేదు. అసలు LIK విడుదలైందో, లేదో అనే అనుమానంలో చాలామంది ఉన్నారు. కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ తెరకెక్కించిన LIK చిత్రానికి తమిళనాట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.
తెలుగులో అసలు రివ్యూస్ లేవు, థియేటర్స్ లో ఆడియన్స్ కూడా ఆలేరు. మరి సక్సెస్ ఫుల్ హీరో ని ఏ దురదృష్టం అంటుకుందో అనే మాట వినబడుతుంది. అంటే డిజాస్టర్ హీరోయిన్, సక్సెస్ లేని డైరెక్టర్ వల్ల ప్రదీప్ రంగనాథన్ కూడా నష్టపోయాడా అంటూ మాట్లాడుకోవడం హైలెట్ అవుతోంది.
హీరోయిన్ కృతి శెట్టి ని వరస డిజాస్టర్ వెంటాడుతున్నాయి. అలాగే విగ్నేష్ శివన్ కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడు. వీరి దురదృష్టము ఏమి హీరో ప్రదీప్ రంగనాథన్ కి అంటుకోలేదు కాదా అనే ఆయన అభిమానుల మాట. మరి LIK హిట్ అయితే ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ లు కంటిన్యూ అయ్యేవి.. కానీ ప్రదీప్ రంగనాథన్ ని LIK డిజప్పాయింట్ చేసినట్టే.




డెకాయిట్ - శృతి హాసన్ ఏమంటుంది 

Loading..