Advertisementt

దోచుకున్న‌వాళ్ల‌కు దోచుకున్నంత‌

Sun 12th Apr 2026 08:57 AM
instagram  దోచుకున్న‌వాళ్ల‌కు దోచుకున్నంత‌
Insta Followers దోచుకున్న‌వాళ్ల‌కు దోచుకున్నంత‌
Advertisement
Ads by CJ

టీవీ సీరియ‌ళ్లు, రియాలిటీ షోలు, సినిమాల‌తో పాపుల‌రైన కొంద‌రు న‌టీమ‌ణులు అర్థ‌న‌గ్న వీడియోల‌తో ల‌క్ష‌ల్లో ఆర్జించ‌డం ఇటీవ‌ల‌ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నెల‌కు రూ.399 చెల్లిస్తే సొగ‌సు కావాల్సినంతా చూడ‌వ‌చ్చు.. అని ఓపెన్ ఆఫ‌ర్ పెడుతున్నారు. యువ‌త‌రానికి మెంబ‌ర్ షిప్ లు ఇస్తున్నారు న‌టీమ‌ణులు. ఒక ప్ర‌ముఖ బుల్లితెర వెండితెర న‌టికి చాలా సులువుగా 1.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఇట్టే ఈజీగా వచ్చి అకౌంట్లో ప‌డిపోయారు. అంతేకాదు.. ఈ ఫాలోవ‌ర్స్ కార‌ణంగా నెల‌కు సులువుగా 8ల‌క్ష‌లు సంపాదించేస్తోంది. ఈ ఖాతాలో వ‌ల్గ‌ర్ డ్యాన్సులు చేస్తూ, శ‌రీరాన్ని చూపిస్తూ ఇంత పెద్ద మొత్తం సంపాదించేస్తోంది ఈ న‌టి.

మీకు ప్ర‌త్యేకంగా ఇక్క‌డ వీడియోలు కావాల‌నుకుంటే.. మెంబ‌ర్ షిప్ తీసుకోవాల‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. అంతేకాదు.. 34-36-34 సైజులు అన్నీ చూపించీ చూపించ‌న‌ట్టు చూపిస్తారు అక్క‌డ‌. ఏదో ఒక క్లాథ్ ఒక‌టి అడ్డుగా ఉంటుంది అంతే.. ఇలాంటి కంటెంట్ కావాల‌నుకుంటే అక్క‌డ‌కు రండి. దీనిని ఎవ‌రికీ పంపించ‌డం కుద‌ర‌దు... అని చెబుతారు. అయితే ఇక్క‌డే ఒక లాజిక్కు ఉంది. షేరింగ్ కి ఛాన్స్ లేదు కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ మెంబ‌ర్ షిప్ లు తీసుకోవాల్సిందే.

ఈ వీడియోలు తీయ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. త‌న సొంత‌ ఫ్లాట్ లోనే కెమెరా ప‌ట్టుకునే కుర్రాడు ఉంటే చాలు.. పూర్తి న‌గ్నంగా ఆల్మోస్ట్ అర్థ‌న‌గ్నంగా ఏదో ఒక ర‌కమైన వీడియోల‌ను తీసి మెంబ‌ర్ షిప్ బేసిస్ లో చానెళ్ల‌లో అమ్మేస్తున్నారు. గ‌య్స్ మీరు రెడీనా? అని ఊరిస్తే ఎవ‌రైనా కుర్రాళ్లు ఆగుతారా?  ఇప్పుడు అదే మిష‌తో ల‌క్ష‌ల్లో సంపాదించే మిష‌న్ లో న‌టీమ‌ణులు స‌క్సెస‌వుతున్నారు.

ఇదంతా క‌రెక్టేనా? అని ప్ర‌శ్నిస్తే తిరిగి ఎదురు స‌మాధాన‌మిస్తున్నారు. మిమ్మ‌ల్ని ఎవ‌రూ చూడ‌మంటున్నారు 399 పెట్టి స‌బ్ స్క్రిప్ష‌న్లు తీసుకుని చూడాలా?  త‌ప్పు మీదే క‌దా! అని కూడా స‌ద‌రు యాంక‌ర్ కం న‌టి ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. త‌న వెర్ష‌న్ ని బ‌ట్టి చూస్తే సినిమా చూడ‌టానికి డ‌బ్బు చెల్లించిన‌ట్టే.. డ‌బ్బు క‌ట్టిన వారికి వీడియోలు చూపించ‌డం అనే మార్కెట్ ని సృష్టించార‌ని చెప్ప‌వ‌చ్చు.

వివేకా కేసులో ``చంపించింది సొంత‌ బాబాయ్ నే ... చంపింది మ‌న‌వాళ్లే.. మ‌ధ్య‌లో పోలీసుల‌కు ఎందుకు?`` అన్న చందంగా .. డ‌బ్బు క‌ట్టిన వాళ్లు చూసుకుంటారు.. మ‌ధ్య‌లో మీకెందుకు? అని కూడా స‌ద‌రు యాంక‌ర్ కం న‌టి అడిగిన వారినే ప్ర‌శ్నిస్తున్నార‌ట‌.

అయితే భార‌త‌దేశంలో కొన్ని క‌ట్టుబాట్లు ఉన్నాయి. ఒక  సోష‌ల్ మీడియాలో బ‌హిరంగంగా బ‌ట్ట‌లు విప్పుకుని తిరుగుతాను.. డ‌బ్బు క‌ట్టు! అని ఎవ‌రైనా అడ‌గ‌గ‌ల‌రా?  భార‌తీయ చ‌ట్టంలో ఇది పూర్తిగా చ‌ట్ట‌విరుద్ధ‌మైన ప‌ని.. అని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ల‌కు నా డ‌బ్బు పెడుతున్నాను మ‌ధ్య‌లో పోలీసుల‌కు ఎందుకు? అని అడ‌గలేన‌ట్టే.. ఈ చ‌ట్ట విరుద్ధ‌మైన ప‌నిలో త‌న‌ను ప్ర‌శ్నించ‌డానికి లేద‌ని బుకాయిస్తున్నారు.

చెమ‌ట ప‌ట్ట‌కుండానే అప్ప‌నంగా ల‌క్ష‌ల్లో ఆదాయం వ‌స్తుంటే ఇలాంటి షోలు ఎందుకు ఆగుతాయి? స‌ద‌రు  న‌టి కం యాంక‌ర్ కి ఏకంగా 7-8 ల‌క్ష‌ల రెవెన్యూ ఈ వీడియోల ఆదాయం రూపంలోనే వ‌చ్చి ప‌డుతోంది. యూట్యూబ్, ఇన్ స్టాగ్ర‌మ్ అన్నిటిలో పెయిడ్ మెంబ‌ర్ షిప్ లు ఉన్నాయి. రూ. 99 , రూ.199, రూ.299, రూ. 399 ఇలా చాలా ఆఫ‌ర్లు ఉన్నాయి. అయితే ఇలాంటి గ్లామ‌ర్ మ‌త్తుకు చిత్త‌యిపోతూ టీనేజీ, కాలేజ్ పిల్ల‌లు జేబులు ఖాళీ చేసుకోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌గా మారింది.

Insta Followers:

SOcial Media

Tags:   INSTAGRAM
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ