వెంకీ-NKR సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే..
Anil Ravipudi Multistarrer With Venkatesh And KalyanRam Begins In July
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని తన మొదటి హీరో కళ్యాణ్ రామ్, తనకు బ్యాక్ టు బ్యాక్ అవకాశం ఇచ్చిన వెంకటేష్ తో చెయ్యబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న అనిల్ రావిపూడి కూల్ గా ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
ఈ చిత్రాన్ని జులై లేదా ఆగస్టు నుంచి పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి-వెంకీ-కళ్యాణ్ రామ్ ల చిత్రాన్ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి పూర్తి స్క్రిప్ట్ తో పక్కా గా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. వెంకీ కి జోడిగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు.
కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించబోతుంది. సో అనిల్ రావిపూడి ఎప్పటిలాగే కూల్ గా తన సినిమాని మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి పలు షోస్ కి జెడ్జి గా కనిస్తుంటే వెంకీ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం చేస్తున్నారు, కళ్యాన్ రామ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు.






































