పూజ హెగ్డే- మృణాల్ సినిమాకి ఇదేం కష్టం

Big trouble for Varun Dhawan's filmBig trouble for Varun Dhawan's film


బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా గ్లామర్ భామలు పూజ హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటించిన హై జవానీతో ఇష్క్ హోనా హై చిత్రం జూన్ 5 న విడుదల కాబోతుంది. గత పది రోజులుగా మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే గ్లామర్ లో పోటీపడుతూ హై జవానీతో ఇష్క్ హోనా హై ని ప్రమోట్ చేస్తున్నారు.

మరో వారం లో విడుదల కావాల్సిన హై జవానీతో ఇష్క్ హోనా హై నికి ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. అది కూడా అలాంటి ఇలాంటి షాక్ కాదు.. ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా రూ.400 కోట్లకు దావా వేయడం హాట్ టాపిక్ అయ్యింది.

కారణం ఏమిటి అంటే పూజ ఎంటర్టైన్మెంట్ కి సంబందించిన ఓ సినిమాలోని పాటను అనుమతి లేకుండా వాడుకోవడంతో వారు హై జవానీతో ఇష్క్ హోనా హై పై ఇన్ని వందల కోట్లకు దావా వేశారు. అయితే గతంలో ఇలాంటివి జరిగాయి. తమిళంలో ఇళయరాజ ఇలానే చేస్తుంటారు. అయితే ఏ ఐదో, పదో అడగాలి కానీ.. 400 కోట్లు అడగడమేమిటి అనేది ఇప్పడు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యింది. 

Varun Dhawan's Hai Jawani To Ishq Hona Hai in trouble