బ్లాస్ట్ బావుంది చూస్తారా..
Blast Zone Public Talk
ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతున్నాయి కానీ వాటిలో ఏ ఒక్కటి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. ఆడియన్స్ కోరుకునే కంటెంట్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. చిన్న సినిమాలైనా కంటెంట్ బావుంటే ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు రెడీనే. కానీ కంటెంట్, కామెడీ, ఎమోషన్స్ ఇవే సినిమాల్లో మిస్ అవుతున్నాయి.
గత రెండు వారాలుగా డబ్బింగ్ సినిమాలైన తమిళ సినిమా వీరభద్రుడు, మలయాళ చిత్రం దృశ్యం 2 చిత్రాలు యావరేజ్ టాక్ తోనూ మంచి కలెక్షన్స్ సాధించాయి. అంటే తెలుగు సినిమాల కన్నా డబ్బింగ్ సినిమాల హవానే కనిపించింది. ఇక ఈ గురువారం బక్రీద్ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో అర్జున్ సార్జా బ్లాస్ట్ జోన్ బావుంది అంటూ ఆడియన్స్ చెబుతున్నారు.
త్రికాల, కట్టలాన్, బ్లాస్ట్ జోన్ విడుదల కాగా అందులో బ్లాస్ట్ జోన్ కి అటు ఆడియన్స్, ఇటు క్రిటిక్స్ మంచి రెస్పాన్స్ చూపించారు. అర్జున్ షార్జా పెరఫార్మెన్స్, ప్రీతీ ముకుందన్ నటన, యాక్షన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ బ్లాస్ట్ జోన్ కి హెల్ప్ అయ్యాయి. నెమ్మదిగా సాగే కథనం కాస్త డిజప్పాయింట్ చేసింది అంటున్నారు.
ఇక శుక్రవారం విడుదలైన అనుపమ పరమేశ్వరన్ మరీచిక కి మరీ పూర్ రివ్యూస్ వచ్చాయి. సో ఈ వారం మరో డబ్బింగ్ చిత్రం ఆడియన్స్ కి ఆనింది. తెలుగులో బ్లాస్ట్ చిత్రానికి మంచి ప్రమోషన్స్ చేసారు. కానీ ఎంతవరకు ఈ చిత్రం టాక్ ఆడియన్స్ కి చేరువవుతుందో అనేది అనుమానం.






































