ప్రస్తుతం థియేటర్స్ లో దున్నేస్తున్న ధురంధర్ ద రివెంజ్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రూ.1500 కోట్ల మార్క్ ని దాటేసింది. మార్చ్ 19 న థియేటర్స్ లో విడుదలైన ధురంధర్ 2 ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఆదిత్య ధర్ డైరెక్షన్, రణ్వీర్ సింగ్ యాక్టింగ్, BGM గురించి మాట్లాడుకోని వారు లేరు.
సెలబ్రిటీస్ ఇంకా ఇంకా ధురంధర్ 2 ని పొగుడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ధురంధర్ ద రివెంజ్ చిత్రం ఓటీటీ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ పార్ట్ 1 థియేటర్స్ లోకి వచ్చాక రెండు నెలలకు పైనే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి వచ్చింది
ఇప్పుడు ధురంధర్ 2 చిత్రం ఎన్ని నెలలకు ఓటీటీ లోకి వస్తుంది అనేది చాలామంది అడుగుతున్నమాట. ధురంధర్ 1 నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంటే.. పార్ట్ 2 మాత్రం నెట్ ఫ్లిక్స్ ని కాదని మేకర్స్ జియో ప్లస్ హాట్ స్టార్ కి భారీ లాభాలకు డీల్ సెట్ చేసుకున్నారు. మరి జియో హాట్ స్టార్ ధురంధర్ 2 ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుంది అనే విషయంలో మే 19 నుంచి పార్ట్ 2 ఓటీటీ లోకి వస్తుంది అనే మాట వినిపిస్తుంది.
అయితే మే 19 కాదు అని.. మరింత ఆలస్యం అంటే మే 29 లేదా జూన్ 4 నుంచి ధురంధర్ 2 జియో హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.




జన నాయగన్ లీక్ - విజయ్ కావాలనే చేసారు 

Loading..