Advertisementt

జన నాయగన్ లీక్ - విజయ్ కావాలనే చేసారు

Fri 10th Apr 2026 11:21 AM
jana nayagan  జన నాయగన్ లీక్ - విజయ్ కావాలనే చేసారు
Jana Nayagan Leaked video viral జన నాయగన్ లీక్ - విజయ్ కావాలనే చేసారు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం విడుదల ఆలస్యమవడానికి కారణం తమిళనాడు DMK పార్టీ.. స్టాలిన్ ప్రభుత్వమే కారణమంటూ విజయ్ TVK పార్టీ ప్రమోషన్స్ లో చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం కుట్రల వల్లే తన సినిమా విడుదల ఆలస్యమైంది అంటూ విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో జన నాయగన్ చిత్రం నుంచి రెండు వీడియో సాంగ్స్, ఇంకా కొన్ని సీన్స్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. ఆ వీడియో క్లిప్స్ కానీ, సీన్స్ క్లిప్స్ కానీ స్ప్రెడ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని జన నాయగన్ మేకర్స్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సమయంలో జన నాయగన్ చిత్రాన్ని లీక్ చేసింది విజయ్ కి సన్నహితులే అంటూ DMK పార్టీ ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. తన ఎన్నికల ప్రచారానికి ఈ క్లిప్స్ విజయ్‌కు చెందిన వారే లీక్ చేసినట్లు ప్రత్యర్థులు, DMK పార్టీ ఆరోపించడం కోలీవుడ్ లో హాట్ హాట్ గా వైరల్ అవుతున్నాయి. రాజకీయాలపై సెటైరికల్‌గా వస్తున్న ఈ చిత్రంలోని ఐదు నిమిషాల క్లిప్‌ను పైరసీ వీరులు నెట్టింట చక్కర్లు కొట్టిస్తున్నారు.

Jana Nayagan Leaked video viral:

Jana Nayagan movie

Tags:   JANA NAYAGAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ