ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Case Against Dhurandhar Production Designer

ప్రొడక్షన్ డిజైనర్ లైంగిక వేధింపుల కేసు!

Case Against Dhurandhar Production DesignerCase Against Dhurandhar Production Designer

 

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మహిళా భద్రత, పని ప్రదేశాల్లో వేధింపుల అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. `ధురంధర్` చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా ప‌నిచేసిన  సైనీ ఎస్. జోహ్రాయ్ పై  లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు ఎఫ్ ఐ ఆర్  నమోదు చేశారు. చిత్ర పరిశ్రమలో సాంకేతిక విభాగానికి చెందిన  కీలక వ్యక్తిపై ఇలాంటి  చట్టపరమైన చర్యలు తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఈ చిత్ర నిర్మాణ పనుల సమయంలో జోహ్రాయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వృత్తిపరమైన పరిధులను దాటి లైంగికంగా వేధించారని ఆరోపించారు. షూటింగ్ సెట్స్‌లో , ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాల సమయంలో ఎదురైన మానసిక, శారీరక ఇబ్బందులను ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.  బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా స్థానిక పోలీసులు  సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించేందుకు పోలీసులు సెట్స్‌లోని తోటి సిబ్బందిని, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చట్టప్రకారం ఈ కేసులో తదుపరి చర్యలు ఉంటాయని, నిందితుడిని త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ హఠాత్ పరిణామం `ధురంధర్` చిత్ర యూనిట్‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.  ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాణ సంస్థ , దర్శకుడు అధికారికంగా ఇంకా స్పందించ‌లేదు. 

FIR Against Dhurandhar Production Designer