Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi emotional note on Sr NTR Jayanthi

ఎన్టీఆర్ జయంతి : చిరు ఎమోషనల్ నోట్

Chiranjeevi emotional note on Sr NTR Jayanthi

 

ఈ రోజు మే 28 నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నారా భువనేశ్వరి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి పెద్దాయనకు నివాళులు అర్పించారు.

ఇక సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ని తలుచుకుని ట్వీట్లు చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరు చేసిన ట్వీట్..  

ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు.

తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా…
ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.

ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది.

ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…

Chiranjeevi tweet on Sr NTR Jayanthi