ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jr. NTR pays tribute to N. T. Rama Rao

ఎన్టీఆర్ ఘాట్ కి తారక్

Jr. NTR pays tribute to N. T. Rama RaoJr. NTR pays tribute to N. T. Rama Rao


ఈరోజు మే 28 నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు నందమూరి కుటుంబ సభ్యులు, ఇంకా అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు మంగళగిరి టిడిపి ఆఫీస్ లో మహానాడు కార్యక్రమంలో సీనియర్ ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించారు.

జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి అక్కడ తాతగారి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ పై పుష్ప గుచ్చాలు ఉంచి తాత ఎన్టీఆర్ ని స్మరించుకుని అక్కడే కాసేపు మౌనంగా కూర్చుని వెళ్లారు. తారక్ ఎన్టీఆర్ ఘాట్ కి వస్తున్నారు అని తెలిసి అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఇక నారా భువనేశ్వరి కూడా ఈరోజు ఉదయమే తండ్రి సమాధి వద్దకు వెళ్లి పూలు చల్లి నివాళులు అర్పించారు.

Tarak visits NTR Ghat