అందరికన్నా పెద్ది హిట్ ఆమెకు ముఖ్యం

జూన్ 4 న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల కాబోతున్న పెద్ది పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ధురంధర్ ద రివెంజ్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో మళ్లీ అంత పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా విడుదల కాకపోవడం, టాలీవుడ్ బాక్సాఫీసు గత కొన్ని వారాలుగా నిస్తేజంగా పడి ఉండడం, మంచి సినిమాలు లేక ప్రేక్షకుల కళ్లన్నీ పెద్ది పైనే ఉన్నాయి.
పెద్ది హిట్ అనేది నిర్మాతలకు ఎంత ముఖ్యమో హీరోయిన్ జాన్వీ కపూర్ కి పెద్ది హిట్ అంతకన్నా ఎక్కువ ముఖ్యం. బాలీవుడ్ లో జాన్వికి ఇప్పటివరకు పెద్ద హిట్ దక్కలేదు. దేవర తో బోణి కొట్టినా అందులో జాన్వీ పాత్ర పరిమితమే. పెద్ది లో జాన్వీ కపూర్ రోల్ కి చాలా ఇంపోర్టన్స్ ఉంది. గ్లామర్ గా మాస్ గా జాన్వీ రోల్ కనిపిస్తుంది.
పెద్ది ట్రైలర్ లో జాన్వీ కపూర్ గ్లామర్ లుక్ పై విమర్శలు కనిపించినా సినిమాలో ఆమె పాత్ర ఇంప్రెస్స్ చేస్తుంది అంటున్నారు. అనుకున్నట్టుగా లేకుండా చరణ్ పక్కన డాన్స్ లకే పరిమితమైతే జాన్వీ కెరీర్ కి కష్టం. పెద్ది పై ఉన్న అంచనాలు చూస్తుంటే హిట్ అనేది పక్కా. అందులో జాన్వీ కి ఎంత క్రెడిట్ దక్కుతుందో చూడాలి.
మరి పెద్ది హిట్ అయితే అమ్మడు కి సౌత్ లో కెరీర్ బావుంటుంది అనడంలో సందేహం లేదు. పెద్ది ప్రమోషన్స్ పూర్తి కాగానే జాన్వీ కపూర్ అల్లు అర్జున్ రాకా కి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.







































