Loading...

ఓటీటీ లకే కాదు థియేటర్స్ కు అవే దిక్కు

 

ఓటీటీ లు పాపులర్ అయ్యాక తెలుగు కంటెంట్ కన్నా ఎక్కువగా ఆడియన్స్ మలయాళ, తమిళ, కన్నడ వెబ్ సీరీస్ లు, సినిమాలకు బాగా ఎట్రాక్ట్ అయ్యారు. మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీ లోకి రాగానే చూసేస్తున్నారు. ఓటీటీ లు పాపులర్ అయ్యాక భాషా భేదం లేకుండా అన్ని భాషల సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు.

ముఖ్యంగా తమిళ, మలయాళ చిత్రాలకు ఓటీటీ లలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఓటీటీలే కాదు ఈ సమ్మర్ లో తెలుగు సినిమాలు థియేటర్స్ లో విడుదలైనా పట్టించుకోని ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలపై మోజు చూపిస్తున్నారు. ధురంధర్ హిందీ డబ్బింగ్ మూవీ, వీరభద్రుడు తమిళ డబ్బింగ్ మూవీ..

మలయాళ దృశ్యం 3 ఇలా డబ్బింగ్ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు లేకపోవడమే. చిన్న సినిమాలనైనా కంటెంట్ బావుంటే ఆదరించే ప్రేక్షకులను తెలుగు సినిమాలు మోసం చేస్తున్నాయి. కాబట్టే తెలుగు ఆడియన్స్ డబ్బింగ్ సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు వెనకాడడం లేదు.

Theatres ,OTT vs Theatres