పెద్ది కి బూతుల పంచాయితీ

Peddi movie trailer launch in MumbaiPeddi movie trailer launch in Mumbai

పెద్ది చిత్రం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ముంబై లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్, రామ్ చరణ్-జాన్వీ కపూర్ ల ఇంటర్వూస్, ఈరోజు మే 23 భోపాల్ లో జరగబోయే పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ లైవ్ షో.. అలాగే ఇంకా మూడు నాలుగు పెద్ది పెద్ద పెద్ద ఈవెంట్స్ ని మేకర్స్ ప్లాన్ చేసారు.

అయితే పెద్ది సెన్సార్ రీసెంట్ గానే జరిగింది. పెద్ది కి U /A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సెన్సార్ సభ్యులు పెద్ది లోని కొన్ని బూతు డైలాగ్స్ కి బీప్ వేసారట. పెద్దిలో చికిరి చికిరి సాంగ్ లోని కొన్ని పదాలను కూడా తొలిగించినట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ పాత్ర తో పలికించిన కొన్ని పదాలకు బీప్ వేసినట్లుగా తెలుస్తుంది.

వాడుకలో ఉన్న పదాలే అయినప్పటికి సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు తెలిపి వాటిని కొన్ని తొలగించి, మరికొన్నింటికి బీప్ వేశారని తెలుస్తుంది. వీటన్నిటికీ పెద్ది యూనిట్ ఒప్పుకుంది అని, లేదంటే పెద్ది కి A సర్టిఫికెట్  వచ్చేదని, అప్పుడు లాస్ అయ్యే కన్నా ఇలా పదాలు తొలిగించినప్పుడు సైలెంట్ గా ఉండడమే మేలు అనుకుని పెద్ది యూనిట్ సైలెంట్ అయ్యి ఉంటుంది. 

Peddi movie Censor happened recently.