టాలీవుడ్ యంగ్ బ్రిగేడ్‌కు 2026వ సంవత్సరం ఓ అగ్నిపరీక్షగా మారింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపును, మార్కెట్‌ను సంపాదించుకున్న యువ హీరోలు ఇప్పుడు ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకోవాల్సిన కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నాగచైతన్య `తండేల్ ` తో 100 కోట్ల క్లబ్‌లో చేరిన జోష్‌ను కొనసాగిస్తూ, తన తదుపరి చిత్రం `వృష కర్మ`తో మరో భారీ హిట్‌ను నమోదు చేయాలని చూస్తున్నారు. తన మార్కెట్ వాల్యూను స్థిరంగా ఉంచుకోవాలంటే ఈ సినిమా హిట్ చైతన్య అత్యంత కీలకం.
థ్రిల్లర్ల స్పెషలిస్ట్ అడివి శేష్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఒకేసారి రెండు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న `డెకాయిట్` పాటు, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సీక్వెల్ `గూడచారి 2` కూడా లైన్లో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకుంటే శేష్ మార్కెట్ వాల్యూ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత `కొరియన్ కనకరాజు` అనే ప్రయోగాత్మక చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. కమర్షియల్ హీరోగా తన ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే? ఈ సినిమా విజయం వరుణ్‌కు ఎంతో అవసరం. ఇంకా `కార్తికేయ 2`తో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం `స్వయంభూ`తో తన పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. సీనియర్ హీరోల హవా -పాన్-ఇండియా చిత్రాల పోటీ మధ్య ఈ యువ హీరోలందరూ తమ ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితులు ఏ ర్పడ్డాయి.




కంటెంట్ బావున్నా కరెక్ట్ ప్లానింగ్ లేదు

Loading..