పెద్ది నుంచి వదులుతున్న కంటెంట్ చూసి ఆహా ఓహో అనుకునేలోపే పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30 కాదు జూన్ 25 కి పోస్ట్ పోన్ అంటూ సోషల్ మీడియా న్యూస్ కామన్ ఆడియన్స్ ని కూడా డిజప్పాయింట్ చేసింది. అనుకున్న సమయానికి పెద్ది నుంచి అప్ డేట్స్ వదిలిన దర్శకుడు బుచ్చి బాబు సినిమాని మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నారు.
మార్చ్ 27 రిలీజ్ అని తర్వాత ధురంధర్ 2 అన్నారు, ఏప్రిల్ 30 అన్నారు, అది క్వాలిటీ కోసం పోస్ట్ పోన్ అంటూ జూన్ 25 కి షిఫ్ట్ చేసి సమ్మర్ హాలిడేస్ ని చేజార్చుకున్నారు. పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, రెండు సాంగ్స్, రీసెంట్ గా వచ్చిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ చూసి మెగా అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా పిచ్చ పిచ్చ గా ఇంప్రెస్స్ అయ్యారు.
కంటెంట్ సూపర్, అదుర్స్, కానీ రిలీజ్ ప్లానింగ్ మాత్రం కరెక్ట్ గా లేదు. పదే పదే పోస్ట్ పోన్ చేస్తూ నవ్వులపాలవుతున్నారు. అదేదో ఏప్రిల్ 30 అంటూ రిలీజ్ డేట్ ఇచ్చేటప్పుడు తెలియదా సమయం సరిపోదు అని అంటూ కామెడీగా పెద్ది మేకర్స్ పై వస్తున్న సెటైర్స్ చూసి మెగా ఫ్యాన్స్ మౌనంగా భరిస్తున్నారు.




ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు 

Loading..