హీరోగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆస్తులు, అప్పులు గురించి ఓపెన్ అవ్వని కోలీవుడ్ స్టార్ విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ అంటే నామినేషన్స్ రోజున అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులకు సంబందించిన ఫుల్ డిటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పెరుంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇక సోమవారం వేసిన నామినేషన్ తో పాటుగా విజయ్ తన ఆస్తులు, అప్పులకు సంబందించిన వివరాలు అందించారు.
అందులో విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్లకు పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, ఇళ్లు, పొలాలు, స్థలాలు కూడా ఉన్నాయి. విదేశీ కార్ల విలువ 15 కోట్లు, తన ఫ్యామిలీ కి ఓ కేజీ బంగారం ఉన్నట్లుగా విజయ్ ఆస్తుల చిట్టాలో చూపించారు.




ఆ నలుగురు హీరోలకు 2026 స్పెషల్

Loading..