NTRNeel గ్లింప్స్ రన్ టైమ్ లాక్డ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కి సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. దాని కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మే 20 న సోషల్ మీడియా ని షేక్ చేసేందుకు వారు తెగ ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ #NTRNeel కాంబో నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రాబోతున్నాయి.

అది కూడా మే 19 మిడ్ నైట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం NTRNeel కాంబో గ్లింప్స్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) గ్లింప్స్ దాదాపు నాలుగు నిమిషాల 35 సెకన్స్ నిడివితో ఉండబోతున్నాయని తెలుస్తుంది. మరి ఈ గ్లింప్స్ రన్ టైమ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇది ట్రైలర్ లేదా గ్లింప్స్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

డ్రాగన్ గా ఎన్టీఆర్ లుక్ చూసేందుకు, అలాగే టైటిల్ ని అఫీషియల్ గా తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది జూన్ లో విడుదల చేస్తున్నట్లుగా రీసెంట్ గానే ప్రకటించారు.

NTR Dragon Glimpse shocks allNTR Dragon