Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Mohan Breaks Down After Split From Keneeshaa

బ్రేకప్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న హీరో

Ravi Mohan Breaks Down After Split From Keneeshaa

భార్య ఆర్తి కి విడాకులిచ్చి సింగర్ కేనీషా తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హీరో రవి మోహన్ ను ఇప్పుడు కేనీషా కూడా అన్యాయం చేసి బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. భార్య వేధింపులు తట్టుకోలేక విడిపోతున్నట్టుగా చెప్పి కేనీషాకు దగ్గరైన రవి మోహన్ కి ఇప్పుడు ఆ రిలేషన్ కూడా బ్రేకప్ అవ్వడం కన్నీళ్లు తెప్పించింది.

తనపై వస్తున్న నెగిటివిటి తట్టుకోలేక తను అన్ని వదిలేసి చెన్నై నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా, ఇకపై అతను(Ravi Mohan ) మీవాడే అంటూ సోషల్ మీడియాలో కేనీషా పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా రవి మోహన్ మీడియా తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఒక ప్రముఖ నటి తన లైఫ్ ని నాశనం చేసింది అంటూ.. గత 14 ఏళ్ల వివాహిక జీవితంలో తాను ఒక బానిసలా బతికానని, తాను ఎంతో కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారని, కనీసం తన పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారని, ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని,  ఇల్లు వదిలి వచ్చేటప్పుడు తన చేతిలో ఏమీ లేదని, తన డబ్బును తన ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునే స్వేచ్చ కూడా ఇవ్వలేదని అన్నారు.

అలాంటి కష్ట సమయంలో తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్ చేసి ఆమె చెన్నై వదిలిపోయేలా చేసారని.. తన పిల్లల కోసమే తాను ఇన్నాళ్లూ బతికానని, వారి కోసమే తను ఇన్నాళ్లు మాట్లాడకుండా నోరు మూసుకున్నాను అని, ఇక నా పర్సనల్ లైఫ్ ని చక్కదిద్దుకున్నాకే సినిమాల్లో నటిటిస్తాను, అప్పటివరకు నటించను అంటూ రవి మోహన్ కన్నీటి పర్యంతమయ్యారు.

Ravi Mohan