పెద్ది ప్రమోషన్స్ కి జాన్వీ దూరం?

పెద్ది విడుదలకు కేవలం రెండు వారాల సమయమే ఉంది. మే 18 నుంచి పెద్ది ప్రమోషనల్ టూర్ కి టీమ్ సిద్దమవడమే కాదు రూట్ మ్యాప్ కూడా ఇచ్చేసారు. మే 18 న ముంబై లో పెద్ది ట్రైలర్ లాంచ్ నుంచి హైదరాబాద్ లో జూన్ 2 న పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు హంగామాకు సిద్ధమైంది.
అయితే రామ్ చరణ్ పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ముంబై. భోపాల్, చెన్నై, బెంగుళూరు ఇలా పెద్ది ఈవెంట్స్ లో రామ్ చరణ్ అలాగే దర్శకుడు బుచ్చి బాబు, కొన్ని చోట్ల మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పాల్గొంటారని సమాచారం. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబై లో జరిగే పెద్ది ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న తర్వాత పెద్ది టీమ్ కి అందుబాటులో ఉండదనే టాక్ వినిపిస్తుంది.
మరి ఏ కారణం చేత జాన్వీ కపూర్ పెద్ది టీమ్ కి అందుబాటులో ఉండదో తెలియదు కానీ.. జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ లో చేసే గ్లామర్ షో కోసం మెగా ఫ్యాన్స్ చాలా వెయిటింగ్. కానీ ఇప్పుడు వారు డిజప్పాయింట్ అవ్వడం మాత్రం ఖాయం.






































