Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan–Buchi Babu Sana’s second collaboration

చరణ్ తో వన్ మోర్ ఛాన్స్

Ram Charan–Buchi Babu Sana’s second collaboration

ఏ దర్శకుడు అయినా తను ఏ హీరోని డైరెక్ట్ చేసినా మరోమారు ఆ హీరోతో పని చెయ్యాలని కోరుకుంటారు. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ లైగర్ విడుదలకు ముందే జన గణ మన స్టార్ట్ చేసాడు. లైగర్ దెబ్బకి ఆ సినిమా అటకెక్కింది. కానీ ఇప్పుడు అలా కాదు.

అంటే దర్శకుడు బుచ్చి బాబు పెద్ది తర్వాత రామ్ చరణ్ తో మరో అవకాశం కావాలని కోరుతున్నాడు. పెద్ది చిత్రం విడుదలయ్యాక రామ్ చరణ్ తో మరో ఛాన్స్ అన్నమాట. మరి బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది ష్యుర్ షాట్ హిట్టు. అంత నమ్మకం ఎందుకంటే.. పెద్ది నుంచి బయటికొచ్చిన ప్రతి కంటెంట్ విపరీతంగా ఎక్కేసింది.

రేపు ట్రైలర్ వస్తే పెద్ది అంచనాలు ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతాయో కూడా చెప్పలేం. ఇలాంటి క్రేజీ కాంబో మరోమారు రిపీట్ అయితే అదే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ హాట్ డిస్కర్షన్. జూన్ 4 న విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్స్ కోసం టీమ్ రెడీ అవుతుంది.

రామ్ చరణ్ లుక్ మార్చేందుకు ముంబై వెళ్ళాడు. తాజాగా రామ్ చరణ్ తో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ దర్శకుడు బుచ్చి బాబ… మ‌ళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్‌ అంటూ బుచ్చి ట్వీట్ చేశాడు. మరి పెద్ది హిట్ అయితే గనక బుచ్చిబాబు తో చరణ్ మరోసారి కన్ ఫర్మ్ అన్నమాట.

Peddi