Advertisementt

పెద్ది కోసం వెనక్కి తగ్గిన విశ్వంభర

Fri 27th Mar 2026 04:54 PM
vishwambhara  పెద్ది కోసం వెనక్కి తగ్గిన విశ్వంభర
Vishwambhara update పెద్ది కోసం వెనక్కి తగ్గిన విశ్వంభర
Advertisement
Ads by CJ

గత ఏడాది శ్రీరామనవమికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ వదిలిన మేకర్స్.. ఏడాది పూర్తయినా ఇప్పటివరకు విశ్వంభర విషయం తేల్చకుండా సైలెంట్ గా ఉంటున్నారు. దానితో విశ్వంభర పై క్రేజ్ మొత్తం గాల్లో కలిసిపోయింది. నిత్యం వార్తల్లో ఉంటేనే ప్రేక్షకులకు ఆనడం లేదు.

ఏడాది కాలంగా సైలెంట్ గా ఉన్న విశ్వంభర పై ప్రేక్షకుల్లో ఇంకేం అంచనాలు ఉంటాయి. మెగా ఫ్యాన్స్ లోను మెల్లగా విశ్వంభరపై ఆసక్తి తగ్గుతుంది. అయితే శ్రీరామ నవమికి విశ్వంభర అప్ డేట్ వదులుదామని మేకర్స్ ముందుగా అనుకున్నారట. కానీ ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే కావడం, పెద్ది నుంచి సూపర్ ట్రీట్ వచ్చినప్పుడు దానికి పోటీగా విశ్వంభర అప్ డేట్ ఎస్టీ మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతారని మేకర్స్ వెనక్కి తగ్గారట.

ప్రస్తుతం సీజీ వర్క్ లో తలమునకలైన విశ్వంభర టీం చూపిస్తున్న వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ లో కొన్ని ఎపిసోడ్స్ అంచ‌నాల‌కు మించి వ‌చ్చిన‌ట్టుగా ఫిలిం నగర్ టాక్. అందులోంచి కొన్నిషాట్స్ తీసి ట్రైల‌ర్ క‌ట్ చేస్తున్నారని.. విశ్వంభర నుంచి రాబోయే ట్రైల‌ర్ ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇవ్వడమే కాదు సినిమాపై అంచనాలు పెరిగి ఆడియన్స్ రిలీజ్ వరకు మట్లాడుకునేలా ఉండబోతుంది అంటున్నారు.

మరి విశ్వంభర ట్రైల‌ర్ ఇంప్రెస్ చేసి సినిమా పై ఆడియన్స్ మదిలో ఉన్న నిస్సత్తువును పారద్రోలి హైప్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. 

Vishwambhara update:

Chiranjeevi Vishwambhara 

Tags:   VISHWAMBHARA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ