Advertisementt

ధురంధర్ 2 కి లక్కీ ఛాన్స్

Fri 27th Mar 2026 04:03 PM
dhurandhar  ధురంధర్ 2 కి లక్కీ ఛాన్స్
Dhurandhar 2 ధురంధర్ 2 కి లక్కీ ఛాన్స్
Advertisement
Ads by CJ

తెలుగులో ధురంధర్ 2 కి మారో వారం దండుకునే ఛాన్స్ దొరికింది. గత వారం విడుదలైన ధురంధర్ 2 నార్త్ లోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో హవా చూపిస్తూ మొదటి వారం తిరిగేసరికి రూ.1000 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ధురంధర్ 2కి బ్రహ్మరధం పడుతున్నారు.

టాలీవుడ్ లో మార్చ్ చివరి వారం అంటే నిన్న శుక్రవారం విడుదలైన సినిమాలేవి ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు. బ్యాండ్ మేళం హిట్ అనుకుంటే అది కూడా తుస్ మంది. యూత్, హ్యాపీ రాజ్ ఇవన్నీ ప్రేక్షకులకు అనలేదు, ఇంకా ధురంధర్ చూసేందుకే ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు తప్ప ఈ చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదు.

మరి టాలీవుడ్ లో ఈ వారం విడుదలైన సినిమాలేవీ ఇంప్రెస్స్ చేయలేకపోవడం ధురంధర్ కి తెలుగులో మారో వారం కలిసొచ్చేలా చేసింది. రెండో వారంలోను ధురంధర్ 2 బుకింగ్స్ అదిరిపోతున్నాయి. డే టైమ్ లోను ఫ్యామిలీ ఆడియన్స్ ధురంధర్ 2 చూసేందుకు థియేటర్స్ కి కదలడమే ఆ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం.

Dhurandhar 2:

Dhurandhar The Revenge

Tags:   DHURANDHAR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ