Advertisementt

సైలెంట్ గా కొత్త స్క్రిప్ట్ తో షాకిచ్చిన మారుతి

Fri 27th Mar 2026 01:22 PM
maruthi  సైలెంట్ గా కొత్త స్క్రిప్ట్ తో షాకిచ్చిన మారుతి
Director Maruthi సైలెంట్ గా కొత్త స్క్రిప్ట్ తో షాకిచ్చిన మారుతి
Advertisement
Ads by CJ

జనవరి 9 న విడుదలైన రాజసాబ్ రిజల్ట్ తర్వాత ఓ సక్సెస్ మీట్లో హడావిడి చేసిన దర్శకుడు మారుతి ఆతర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రాజసాబ్ చిత్రాన్ని ఇష్టం వచ్ఛినట్టుగా తీసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి మారుతి కి చుక్కలు చూపించారు. క్యాష్ ఆన్ డెలివరీ బిర్యానీ ఆర్దర్స్ తో బయటికి రాకుండా బెంబేలెత్తించారు.

ఆ దెబ్బకు కామ్ గా కొత్త స్క్రిప్ట్ కోసం సమయాన్ని కేటాయించిన దర్శకుడు మారుతి అల్లు శిరీష్ పెళ్ళిలో జస్ట్ అలా కనిపించి మాయమై మళ్లీ శ్రీరామ నవమి సందర్భంగా సోషల్ మీడియాలో తేలాడు. అది కూడా రాములోరికి పూజ చేసి కొత్త స్క్రిప్ట్ రెడీ అన్నట్టుగా ఆ పేపర్స్ ని పూజ లో పెట్టి సెల్ఫీ దిగి పోస్ట్ చేసాడు.

మరి మారుతి కోసం ఏ హీరో సై అంటాడో తెలియదు కానీ.. మారుతి మాత్రం కొత్త కథను సిద్ధం చేసి పూజ చేసేసాడు. శ్రీరామనవమికి తన కొత్త జర్నీ స్టార్ట్ అని చెప్పకనే చెపేప్సాడు.

Director Maruthi:

Director Maruthi celebrated Sri Rama Navami

Tags:   MARUTHI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ