Advertisementt

వారణాసి - రాజమౌళి లెక్క వేరు

Fri 27th Mar 2026 12:53 PM
varanasi  వారణాసి - రాజమౌళి లెక్క వేరు
Varanasi - Rajamouli వారణాసి - రాజమౌళి లెక్క వేరు
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కాశీ సెట్ వేసి అక్కడ చిత్రీకరణ చేస్తున్నారు. రీసెంట్ గా వారణాసి సెట్ వీడియోస్ ని రాజమౌళి రివీల్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు వారణాసి గ్లోబల్ ఈవెంట్ తో సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి వారణాసి కి సంబందించిన అప్ డేట్స్ వరసగా వస్తూనే ఉన్నాయి.

ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇలా కీలక నటులంతా వారణాసి కి సంబందించిన లీకులు వదులుతునా దర్శకుడు రాజమౌళి మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. ఎప్పుడు ఆచి తూచి సినిమా అప్ డేట్స్ అందించే రాజమౌళి వారణాసి విషయంలో చాలా డిఫరెంట్ గా సినిమా కబుర్లను హాలీవుడ్ మీడియాకి చేరవేస్తున్నారు.

అయితే రాజమౌళి సౌత్ మీడియాని ముఖ్యంగా నేషనల్ మీడియా కన్నా ఎక్కువగా ఇంటర్నేషనల్ మీడియాకి ప్రాధాన్యత ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ ని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గానే చూపించబోతున్నారు. కాకపోతే లోకల్ ముఖ్యంగా టాలీవుడ్ మీడియా ను పట్టించుకోకపోవడం పట్ల సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ మొదలయ్యింది.

Varanasi - Rajamouli:

Varanasi Movie 

Tags:   VARANASI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ